పార్లమెంట్‌వీరులకు సలాంపశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా 14 నెలల కాల వ్యవధి ఉన్నా ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలకు మద్దతు వెల్లువెత్తుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు క్రాస్‌ వద్ద యువకులు ఫ్లకార్డు పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. వారు వైయస్‌ జగన్‌ను కలిసి ప్రత్యేక హోదా సాధనకు చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తూ మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తాం..చెస్తామన్న నాయకులు మాట తప్పారని, వచ్చే ఎన్నికల్లో వారికి గుణపాఠం చెబుతామని విద్యార్థులు, యువకులు హెచ్చరించారు. హోదా సాధనకు పదవులు త్యాగం చేసిన నాయకులు చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం పదవులు త్యాగం చేసిన పార్లమెంట్‌ వీరులకు సలాం అంటూ నినదించారు. వారు తెచ్చిన ఫ్లకార్డులు చేతపట్టుకొని వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించారు.
 
 
Back to Top