పార్ల‌మెంటులో పోరాటం

హైద‌రాబాద్‌ : ఓటుకి కోట్లు కుంభ‌కోణం మీద పార్ల‌మెంటులో పోరాటం చేయాల‌ని వైఎస్సార్
సీపీ నిర్ణ‌యించింది. మంగ‌ళ‌వారం నుంచి
పార్ల‌మెంటు స‌మావేశాలు
ప్రారంభ‌మవుతున్న నేప‌థ్యంలో పార్టీ
ఎంపీల‌తో అధ్య‌క్షుడు
వైఎస్ జ‌గ‌న్
స‌మావేశం అయ్యారు. పార్ల‌మెంటులో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఎంపీల‌కు దిశానిర్దేశం
చేశారు. అనంత‌రం పార్ల‌మెంట‌రీ పార్టీ
నాయ‌కుడు మేక‌పాటి
రాజ‌మోహ‌న్ రెడ్డి
మీడియాతో మాట్లాడారు. ఓటుకి కో్ట్లు వ్య‌వ‌హారం ప్ర‌జాస్వామ్యానికే మ‌చ్చ వంటిద‌ని, ఆ అంశంపై
పార్ల‌మెంటులో ప్ర‌శ్నిస్తామ‌ని
ఆయ‌న వెల్ల‌డించారు.
ఈ కేసులో టీడీపీ నేత‌లు రెడ్
హ్యాండెడ్ గా దొరికిపోయినా, కేసును
నీరుగార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న
ఆరోపించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ల్ల‌నే పుష్క‌రాల్లో తొక్కిస‌లాట జ‌రిగి
అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయార‌ని ఆవేద‌న
వ్య‌క్తం చేశారు. ఈ
దుర్ఘ‌ట‌న‌కు
చంద్ర‌బాబే నైతిక బాధ్య‌త వ‌హించాల‌ని ఆయ‌న
డిమాండ్ చేశారు. దీనిపై కూడా పార్ల‌మెంటులో
ప్ర‌శ్నిస్తామ‌ని చెప్పారు.

భూ
సేక‌ర‌ణ బిల్లు,
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు
ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు,
రాష్ట్రానికి స్పెష‌ల్ జోన్‌,
ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌, పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం హామీలు వంటి
విష‌యాల్ని చ‌ర్చిస్తామ‌ని
వెల్ల‌డించారు. భూ సేక‌ర‌ణ బిల్లుకు స‌వ‌ర‌ణ‌లు చేస్తే మద్ద‌తిస్తామ‌ని మేక‌పాటి
స్ప‌ష్టం చేశారు.

Back to Top