హతమార్చేందుకు పరిటాల కుటుంబం కుట్ర

అనంతపురం : తనను చంపేందుకు పరిటాల కుటుంబం కుట్ర పన్నిందని అనంతపురం జిల్లా
రాప్తాడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
ఆరోపించారు.  స్థానికంగా ఆయన మాట్లాడుతూ...
 ప్రభుత్వాసుపత్రిలో పరిటాల వర్గీయులు తనపై
దాడికి తెగపడ్డారని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు
గన్ మన్లను ఉపసంహరించారని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ప్ర‌కాశ్‌రెడ్డి
ఆందోళన వ్యక్తం చేశారు.

 రాప్తాడులోని టీడీపీ నేతలు వైయ‌స్సార్
కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని పరిటాల కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని  వైయ‌స్సార్
సీపీ నేత తోపుదుర్తి చందు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు భౌతిక దాడులు
జరుగుతున్నా పోలీసులు మాత్రం నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారిస్తున్నారని మండిప‌డ్డారు.
అధికార పార్టీ తొత్తులుగా పోలీసులు మారారని ఆయ‌న ఆరోపించారు. 

 

Back to Top