ప‌రిశ్ర‌మ‌ల‌తోనే నిరుద్యోగుల‌కు ఉపాధి

సర్వేపల్లి(వెంకటాచలం): ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుతోనే నిరుద్యోగుల‌కు ఉపాధి దొరుకుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు.  వెంకటాచలం మండలం సర్వేపల్లిలో నిర్మించిన ఎస్‌ఎన్‌జె డిస్టలరీస్‌(బీరుప్యాక్టరీ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం హాజరయ్యారు. ఈసందర్భంగా చైర్మన్‌ జై మురుగన్‌తో ఫ్యాకర్టీలో ఎంతో మందికి ఉపాధి చూపారనే విషయంపై చర్చించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటైతే సమీప గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. బీరుఫ్యాక్టరీలో 500మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు చేసే సమయంలో ప్రజలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం, పర్యావరణ అనుమతులుతో పరిశ్రమలు ఏర్పాటుచేయాలని తెలియజేశారు. అలాగే ఎలాంటి ఇబ్బందులు లేని పరిశ్రమలు నిర్మించినప్పడు ప్రజలు సహకరించాలని సూచించారు.
Back to Top