పంట‌లు న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకోవాలి

హిర‌మండ‌లం (శ్రీ‌కాకుళం):  జిల్లాలో ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు చాలా పంట‌లు దెబ్బ తిన్నాయ‌ని, రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి శాంతి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరారు. భారీ వ‌ర్షాలు కురిసిన పాత‌ప‌ట్నం, మెళియపుట్టి,కొత్తూరు,హిరమండలం,ఎల్‌ఎన్‌పేట మండలాల ప‌రిధిలో రెడ్డి శాంతి ప‌ర్య‌టించి రైతుల క‌ష్టాలు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల క‌ష్టాల‌ను ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారంతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని డిమాండ్‌ చేశారు.

Back to Top