పన్నులతో జనం నడ్డివిరుస్తున్న ప్రభుత్వం

గుడివాడ (కృష్ణాజిల్లా), 7 ఏప్రిల్‌ 2013: వివిధ రకాల పన్నులు వేసి ప్రస్తుత ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల విమర్శించారు. శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 114వ రోజు ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ శివారు ఏలూరు రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆమె జొన్నపాడు చేరుకున్నారు. ఈ సందర్భంగా జొన్నపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ బాధలను శ్రీమతి షర్మిలకు చెప్పుకున్నారు.

పరీక్షల సమయంలో విద్యుత్ ఉండటం లేదని విద్యార్థులు‌ శ్రీమతి షర్మిల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు లేదని, రేషన్ కార్డులు లేవని, పెన్ష‌న్ అందడం లేదని‌ పలువురు మహిళలు తెలిపారు. ప్రజలపై భారం పడకుండా మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి కార్యక్రమా‌లను సక్రమంగా నిర్వహించారని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా తెలిపారు. రాజన్న రాజ్యంలోనే అన్ని వర్గాలు లాభపడ్డారని చెప్పారు. జగనన్న వస్తారని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు, మహిళలకు వడ్డీలేని రుణాలను జగనన్న అందజేస్తారని చెప్పారు.‌ మన రాష్ట్రాన్ని మహానేత వైయస్ హరితాంధ్రప్రదేశ్ చేస్తే, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అంధకారప్రదేశ్గా మార్చారన్నారు. చంద్రబాబుకు చెప్పినట్లుగానే, కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.
Back to Top