వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పంచిరెడ్డి

ఎచ్చెర్ల:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బొందల కోడూరు గ్రామానికి చెందిన పంచిరెడ్డి రాంబాబు నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయ‌నకు శనివారం ఫ్యాక్స్‌ద్వారా సమాచారం వచ్చింది. రాంబాబు స‌తీమ‌ణి పంచిరెడ్డి రూప బొంతలకోడూరు సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తన సేవలు గుర్తించిన పార్టీ అధినేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, ఎచ్చెర్ల నియోజక వర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top