<br/>గుంటూరు: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పల్నాడుకు చేరుకుంది. సాయంత్రం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. పల్నాడులోని దారులన్నీ కూడా నరసరావుపేట వైపే అన్నట్లుగా ఉంది. పట్టణంలో ఎటు చూసినా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు, ప్రజలతో కళకళలాడుతోంది. గురజాల, కారంపూడి, వినుకొండ, మాచర్ల నుంచి అభిమానులు వెల్లువలా తరలిరావడంతో నరసరావుపేట జనసంద్రమైంది. సభా ప్రాంగణానికి వేలాదిగా జనం తరలివెళ్తున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా జనం ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి నరసరాపుపేటలోకి అడుగుపెట్టినప్పటి నుంచి వేలాది మంది వైయస్ జగన్‌తో అడుగులో అడుగులు వేస్తున్నారు. పాదయాత్రలో ప్రభుత్వ వ్యతిరేకత కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా సాధిస్తేనే ఏపీకి భవిష్యత్తు అని, వైయస్ జగన్ వల్లే హోదా సాధ్యమని స్థానికులు విశ్వసిస్తున్నారు. వైయస్ జగన్ రాకతో పల్పాడు ఉప్పొంగింది.