ముచ్చట గొలిపిన షర్మిల దీక్ష, పట్టుదల

పాలకొండ (శ్రీకాకుళం జిల్లా) :

‘శ్రీమతి షర్మిలను బాగా దగ్గరగా చూసినప్పుడు ఆమె తండ్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి గారి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి.. ఆమె దీక్ష, పట్టుదల చూస్తే ఎంతో ముచ్చటేసింది. రాష్ట్ర ప్రజలందరినీ తమ నాయకత్వ లక్షణాల ద్వారా ప్రభావితం చేసే శక్తి‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ తనయుడు శ్రీ జగన్మమోహన్‌రెడ్డితో పాటు శ్రీమతి షర్మిలలో కూడా ప్రతిబింబిస్తున్నాయి’ అని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం తల్లి రుక్మిణమ్మ కొనియాడారు.

 ‘వైయస్ రాజశేఖరరెడ్డి నాకు ఎన్నో దశాబ్దాలుగా తెలుసు. రాష్ట్రంలో జవజీవాలు కోల్పోయిన కాంగ్రె‌స్ పార్టీని తన '‌ప్రజాప్రస్థానం' పాదయాత్ర ద్వారా పునరుజ్జీవింప చేశారాయన. రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఆ మహానేత మరణించినా ఆయన వారసత్వాన్ని పిల్లలు శ్రీ జగన్,‌ శ్రీమతి షర్మిల అక్షరాలా  పుణికిపుచ్చుకున్నారు’ అని రుక్మిణమ్మ అన్నారు. మరో ప్రస్థానంలో భాగంగా శ్రీమతి షర్మిల బుధవారంనాడు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పాదయాత్ర చేస్తుండగా రుక్మిణమ్మ తన కోడలు ఇందుమతి, మనుమడు విక్రాంత్‌ దంపతులతో కలసి అభినందించారు. శ్రీమతి షర్మిలతో ఆమె కొద్దిసేపు సంభాషించారు. ఈ సందర్భంగా తన నివాసంలో రుక్మిణమ్మ మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే మహానేత వైయస్ఆర్ కుటుంబం పట్ల‌ ప్రజలకు ఎంత అపారమైన విశ్వాసం ఉందో స్పష్టమవుతోందని రుక్మిణమ్మ హర్షం వ్యక్తం చేశారు.

Back to Top