వైయ‌స్ఆర్‌సీపీలోకి పెయింట‌ర్స్ కార్మికులు

అనంత‌పురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. అన్ని జిల్లాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయ‌కులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా అనంత‌పురం జిల్లాలో పెయింట‌ర్స్ కార్మికుల సంఘం స‌భ్యులు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. గుంత‌క‌ల్లు స‌మ‌న్వ‌య క‌ర్త వై.వెంక‌ట‌రామిరెడ్డి కార్మికుల ప్ర‌తినిధుల‌కు కండువాక‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా వెంక‌ట‌రామిరెడ్డి మాట్లాడుతూ త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ప‌నిచేసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి న్యాయం చేస్తామ‌ని వెంక‌ట‌రామిరెడ్డి హామీ ఇచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top