దొంగలా దొరికిపోయినందునే మకాం మార్చాడు

హైదరాబాద్ః పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉంటానన్న చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యాక...అంతా సర్దుకొని జూన్ లోపే వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఛాంబర్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు...లంచం కేసులో దొంగలా దొరికిపోవడంతో కేసీఆర్ కాళ్లు పట్టుకొని, డీల్ కుదుర్చుకుని విజయవాడకు మకాం మార్చారని దుయ్యబట్టారు.  కేసీఆర్ తో ఒప్పందం కారణంగానే హైదరాబాద్ ఖాళీ చేసినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారన్నారు. సెక్రటేరియట్ కు వెళ్లేందుకు బయపడుతున్నందునే  చంద్రబాబు విజయవాడ నుంచి పరిపాలన సాగిస్తున్నారన్నారు. 

బాక్సైట్ కు సంబంధించి చంద్రబాబు చేస్తున్న కుట్రను తిప్పికొడుతున్నందునే గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందని పద్మ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు ఏంమాట్లాడినా అధికారమదంతో అక్రమంగా కేసులు బుక్ చేస్తున్నారన్నారని చంద్రబాబుపై ఫైరయ్యారు. కేసులుతో భయపెట్టాలని చూస్తున్న చంద్రబాబు...గిరిజనుల అభిరుచి మేరకు జీవో ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్షంపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 
Back to Top