పోలీసుల తీరుకు నిర‌స‌న‌గా జంగా పాద‌యాత్ర

గురజాల

: పోలీసులు ప్రజలను రక్షించే రక్షక భటులా...లేక భక్షక భటులా అని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ప్ర‌శ్నించారు.  దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో గణేష్‌ నిమజ్జన వేడుకల్లో పోలీసులు వైయస్ఆర్‌సీపీకి చెందిన వారిపై అక్రమంగా కేసు బనాయించి వారిని స్టేషన్‌లో కొట్టాడాన్ని నిరసిస్తూ గురువారం ఆయన పాద‌యాత్ర చేపట్టారు. దాచేపల్లి పోలీస్‌ స్టేషన్‌ నుండి గురజాల ఆర్డీవొ కార్యాలయం వరకు పాదయాత్రగా వచ్చి ఆర్డీవొకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే , నాయకులు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పచ్చచోక్కాలు వేసుకున్న కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు టీడీపీ నాయకులే రెచ్చ‌గొడుతున్నార‌ని విమ‌ర్శించారు. ప్రశాంతంగా వున్న గ్రామాలను ఫ్యాక్షన్‌ రాజకీయాలతో నెత్తుటిచాయలు సృష్టిస్తున్నారన్నారు. దగ్గిన, తుమ్మినా టీడీపీ నాయకులు వైయస్సార్‌సీపీ నాయకులపై కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చెప్పినట్లుగా పల్నాడు ప్రాంతంలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఎంతో మంది వైయస్ఆ ర్‌సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పదవి శాశ్వతంగా వుండదని ఇక్కడి ప్రజలు శాశ్వతంగా వుంటారన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు.  పల్నాడు ప్రాంతంలోని సీఐలు ఎమ్మెల్యే చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుండి పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కువశాతం వైయస్ఆర్‌సీపీ నాయకులవే నని, దొంగతనాలు , గోడవలు చేసిన కేసులు నమోదు తక్కువన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారి చేతుల్లో కీలు బొమ్మలుగా మారారన్నారు. తక్షణమే రూరల్‌ సీఐ ఆళహరి శ్రీనివాస్‌పై చ‌ర్యలు తీసుకోవాలన్నారు.  కార్యక్రమంలో దాచేపల్లి జడ్‌పీటీసీ మూలగొండ్ల ప్రకాశ్‌రెడ్డి, పిడుగురాళ్ల జడ్‌పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, మండల కన్వీనర్లు సిద్దాడపు గాందీ, షేక్‌ జాకీర్‌ హుస్సున్, చల్లా పిచ్చిరెడ్డి,సీనియర్‌ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, చల్లా కాశీబాబు, కర్రా చినకోటేశ్వరరావు, కత్తి చలమరాజు, పోలు వెంకటరెడ్డి, వీరంరెడ్డి అమరారెడ్డి, కె అన్నారావు, అనిల్, సోమా వెంకట్రావు దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం మండల నాయకులు, కార్యకర్తలు, ముత్యాలంపాడు గ్రామస్తులు పాల్గొన్నారు.  

Back to Top