వైయస్‌ జగన్‌ సీఎం కావాలని పాదయాత్ర

తిరుమల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వైయస్సార్సీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. వైయస్‌ఆర్‌ జిల్లా రైల్వేకోడూరు నియోజవర్గం ఓబులవారిపల్లె  మండలానికి చెందిన 800 మంది చేపట్టిన పాదయాత్ర తిరుమల చేరుకుంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ జయపాల్‌రెడ్డి నేతృత్వంలో వీరు గోవిందమాల ధరించారు. సోమవారం ఉదయం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభించి అన్నమయ్య కాలిబాట మీదుగా మంగళవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. దాదాపు అందరూ శ్రీవారికి తలనీలాలు సమర్పించి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ..చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించారన్నారు. రైతుల గురించే ఆలోచించే నాథుడు లేడన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నాటి పాలన మళ్లీ వస్తుందన్నారు. ఇందుకోసం తాము పాదయాత్రగా వచ్చి తిరుమలలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు పార్టీ నాయకుడు జయపాల్‌రెడ్డి తెలిపారు.

Back to Top