190వ రోజుకు చేరిన మరో ప్రజాప్రస్థానం

శృంగవరం 25 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారానికి 190వ రోజుకు చేరింది.  ఉదయం విశాఖ జిల్లా శృంగవరం నుంచి మరో ఆమె పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో మహానేత అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. శ్రీమతి షర్మిల  గాంధీనగరం, తాండవ జంక్షన్‌, డి. ఎర్రవరం, ములగపూడి, మెట్టపాలెం, బెన్నవరం మీదుగా సాగుతారు. మంగళవారం ఆమె 12.7 కిలోమీటర్లు నడుస్తారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం సాయంత్రం విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

Back to Top