యలమంచిలి నియోజకవర్గంలోకి పాదయాత్ర

వైయస్ జగ‌న్‌ను క‌లిసిన చోడ‌వాడ రైతులు,ఎన్ఎంలు
ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు వైయస్ ఆర్ సీపీలో చేరిక‌

యలమంచిలి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌వేశించిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర లో  వేలాది మంది అడుగులో అడుగేస్తూ జ‌గ‌న్‌తో సాగుతున్నారు. వారాహ న‌ది మీద‌గా నియోజ‌క‌ర్గంలోకి అడుగుపెట్టారు. టంగుటూరి ప్ర‌కాశం జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళ‌ర్పించి విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట  నియోజ‌క‌ర్గం  ఎస్‌.రాయ‌వ‌రం మండ‌లం దార్ల‌పూడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు.  పోల‌వ‌రం ఎడ‌మకాల్వ మ‌ర‌మ్మ‌తు ప‌నులు పూర్తిచేయాల‌ని చోడ‌వాడ‌ రైతులు జ‌గ‌న్‌ను కోరారు. త‌మ ఉద్యోగాలు ప‌ర్మినెంట్ చేయాల‌ని ఎఎన్ఎంలు విన్న‌వించుకున్నారు. ప‌లువురు కాంగ్రెస్‌నేత‌లు వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరారు. 
Back to Top