డల్లాస్‌లో వాక్ విత్ జ‌గ‌న‌న్న‌డల్లాస్‌ : వైయ‌స్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా డల్లాస్‌లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వాక్ విత్ జ‌గ‌న‌న్న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  300 మంది భారీ ర్యాలీగా పాదయాత్రను చేపట్టారు. ఈ ర్యాలీ సాయంత్రం నాలుగు గంటలకు ఇర్విన్‌లోని గాంధీ పార్క్‌​ వద్ద మొదలై మళ్లీ మూడు గంటల తరువాత అ‍క్కడికే చేరుకుని ముగించారు.  నినాదాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ ర్యాలీని శ్రీధర్‌ కొరసపాటి, రమణ్‌ రెడ్డి క్రిష్టపాటి, రమణ పుట్లుర్‌, సుబ్బారెడ్డి కొడూరు, క్రిష్ణ మోహన్‌, మధు మల్లు, రితుమల్‌ రెడ్డి, సునిల్‌ దేవిరెడ్డి, రవీంద్ర, రామిరెడ్డి బూచిపుడి, భాస్కర్‌ గండికోట, చందు రెడ్డి, యశ్వంత్‌ రెడ్డి కలిసి నిర్వహించారు. 


Back to Top