చిరుజల్లుల మధ్య పాదయాత్ర


టీడీపీ రుణమాపీ పత్రం నాలుగు గీక్కోడానికి కూడా పనికిరాదు
వైయస్‌ జగన్‌పై పాటపాడి అభిమానం చాటుకున్న విద్యార్థులు
చంద్రబాబు ఇంకా మోసం చేస్తున్నాడు: ఆక్వా రైతులు

తూర్పుగోదావరి: ప్రజా సంక్షేమమే శ్రేయస్సుకు రాష్ట్ర ప్రజలు పడుతున్న సమస్యలను తెలుసుకొని వారి కష్టాలు కడతేర్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయస్‌ జగన్‌ తలపెట్టిన పాదయాత్రను చిరుజల్లులు ముద్దాడాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో 202వ రోజు పాదయాత్ర చిరుజల్లలు మధ్య కొనసాగుతోంది. అడుగడుగునా.. జననేతకు ప్రజలు స్వాగతాలు పలుకుతూ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని మధ్యాహ్న భోజన కార్మికులు, సీపీఎస్‌ ఉద్యోగులు చెప్పారు. ఈ మేరకు జననేతకు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ముమ్మడివరం ఎయిమ్స్‌ విద్యార్థులు జననేతపై పాటపాడి అభిమానం చాటుకున్నారు. 

చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ పత్రం నాలుక గీక్కోవడానికి పనికిరావడం లేదని రైతు పిన్నమరాజు సత్యనారాయణరాజు వైయస్‌ జగన్‌ను కలిసి చెప్పారు. తనకు రూ. 1.5 లక్షల రుణమాఫీ పత్రాన్ని ప్రభుత్వం అందజేసిందని, ఆ పత్రాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పూర్తిగా రుణమాఫీ చేస్తానని, బ్యాంక్‌ల్లో తాకట్టుపెట్టిన బంగారం ఇంటికి తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నట్టేట ముంచాడని మండిపడ్డారు. 

చంద్రబాబు రూ. 2లకే యూనిట్‌ కరెంట్‌ అంటూ మోసం చేశాడని ఆక్వా రైతులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిసి మొరపెట్టుకున్నారు. మూరుముళ్ల గ్రామం వద్ద వైయస్‌ జగన్‌ను కలిసిన ఆక్వా రైతులు చంద్రబాబు ప్రకటించిన కరెంటు చార్జీలు అమలు కావడం లేదన్నారు. ఇంకా పాత చార్జీలతోనే కరెంటు బిల్లులు వస్తున్నాయని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
Back to Top