ప‌డ‌వ ప్ర‌మాదంపై వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

 తూర్పు గోదావ‌రి:  తూర్పుగోదావ‌రి జిల్లా ఐ.పోల‌వ‌రం వ‌ద్ద జ‌రిగిన ప‌డ‌వ ప్ర‌మాదంపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్ర్భాంతికి గుర‌య్యారు. ఘ‌ట‌న విష‌యం తెలియ‌గానే పార్టీ నాయ‌కుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. బాధితుల‌కు త‌క్ష‌ణం స‌హాయం అందించాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం కూడా బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష నేత‌ విజ్ఞ‌ప్తి చేశారు. ఘ‌ట‌నా స్థ‌లానికి పార్టీ నాయ‌కులు వెళ్ల‌వ‌ల్సిందిగా ఆదేశించారు. వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశానుసారం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ త‌దిత‌ర నాయ‌కులు ఘ‌ట‌నా స్థ‌లానికి బ‌య‌లుదేరారు. 

Back to Top