పచ్చనేతల దుష్టచర్యపై అగ్గిమీదగుగ్గిలం..!

గుంటూరుః ప్రత్యేకహోదా కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేయడం పట్ల ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతలు  విరుచుకుపడ్డారు. దొంగదారిలో అందరూ నిద్రిస్తున్న సమయంలో చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకొని దీక్షకు ఆటంకం కలిగిచండంపై మండిపడుతున్నారు. 

మోపిదేవి వెంకటరమణ...!
ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని వైఎస్సార్సీపీ నేత మోపిదేవి వెంకటరమణ చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసినా.. ప్రత్యేక హోదా ఉద్యమం ఆగే ప్రసక్తే లేదన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి వద్ద ఆయన మోపిదేవి మీడియాతో మాట్లాడారు.  ఏడు రోజుల నుంచి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆహారం తీసుకోకుండా దీక్ష చేసినా ..స్పష్టమైన హామీ లేకుండా పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని దీక్షను భగ్నం చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోసంచేస్తోంది కాబట్టే జగన్ తన ప్రాణాలను పణంగా పెట్టి దీక్షకు కూర్చున్నారు.

రోజా...
చంద్రబాబు  చిన్నమెదడు చితికిపోయిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు.  అప్రజాస్వామిక రీతిలో వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేసిన తీరును ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. మసీదులు, గుళ్లు, చర్చిల్లో ప్రజలు చేసిన ప్రార్థనలు చూసి.. భయపడి, వెన్ను వణికే దొంగదారిన తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.  ప్రత్యేక విమానాల్లో తన భజనపరులను వెంటేసుకొని తిరుగుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని దోచి సింగపూర్కో మలేసియాకో అమ్మేద్దామని చూస్తున్నారని దుయ్యబట్టారు. తప్పుడు నివేదికతో తప్పుదోవ పట్టించిన 420 మంత్రి కామినేనిపై నిప్పులు చెరిగారు. ఆయన నేతృత్వంలో నడిచే ఎలుకలు, పాములకు అడ్డా అయిన  గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జగన్ కు ట్రీట్ మెంట్ చేయడాన్నిను మేం ఒప్పుకోమన్నారు. వెంటనే వైఎస్ జగన్ ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు..

లక్ష్మీపార్వతి..
వైఎస్ జగన్ కు పేరొస్తుందన్న దురుద్దేశంతో సీఎం, మంత్రులు నీచమైన ఆలోచనలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు జీవితమంతా మాయ మాటలతో మాయ చేస్తూనే వస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌ను మోసం చేశారు.  మొన్నటి ఎన్నికల్లో ప్రజలను మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత చేపట్టిన దీక్ష విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. ఇలా ఇంకెంతకాలం బతుకుతారో ఏమో’’ అని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబుగా కొంచెం మంచిగా మారితే  కనీసం ఎన్టీఆర్ ఆత్మయినా శాంతిస్తుందని సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వాలు మాట తప్పాయని విమర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ని పరామర్శించారు. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. టీడీపీ మాత్రం రెండు కేంద్రమంత్రి పదవులు సాధించుకుందన్నారు. 
Back to Top