అసెంబ్లీ కమిటీహాల్లో బుగ్గన అధ్యక్షతన పీఏసీ సమావేశం

హైదరాబాద్ః అసెంబ్లీ కమిటీ హాల్లో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశమైంది. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. పలు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలకు సంబంధించిన అంశాలపై పీఏసీ అధికారులకు సూచనలు చేసింది. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలు అంశాలను పీఏసీ పరిశీలించింది. అధికారుల నిర్లక్ష్యంతో పలు పథకాలకు కేంద్ర నిధులు రాలేదని పీఏసీ ఆక్షేపించింది. జనరిక్ మందులను ఎందుకు ప్రోత్సహించలేదని అధికారులను ప్రశ్నించింది. 

Back to Top