పార్టీ విద్యుత్‌ ఉద్యోగుల కార్యాలయం ప్రారంభం

పులివెందుల : రాష్ట్రంలో తొలిసారిగా పులివెందులలో వై‌యస్‌ఆర్‌సిపి విద్యుత్ ‌ఉద్యోగుల యూనియన్ కార్యాల‌యం ప్రారంభమైంది. మాజీ ఎం.పి.పి., ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఈసీ గంగిరెడ్డితో కలిసి వైయస్‌ఆర్‌సిపి నాయకుడు వైయస్‌ భాస్కర్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. పులివెందుల బైపాస్‌రోడ్డులో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ‌చొరవ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 1999 తర్వాత విద్యుత్‌ విభాగంలో చేరిన ఉద్యోగులకు పింఛన్ సౌక‌ర్యం కల్పించేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్మికుల సమస్యలను ట్రాన్సుకో సిఎండి దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పులివెందులలో వైయస్‌ఆర్‌సిపి విద్యుత్ ఎంప్లాయీస్ యూనియ‌న్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈసీ గంగిరెడ్డి అభినందించారు. అనంతరం వైయస్‌ఆర్‌సిపి విద్యుత్ ఎంప్లాయీ‌స్ యూనియ‌న్ లో‌గోను ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందు కార్యాలయాన్ని గంగిరెడ్డి ప్రారంభించగా.. కంప్యూటర్‌ను వైయస్ భాస్క‌ర్‌రెడ్డి ప్రారంభించారు.
Back to Top