పార్టీ వైద్య ఉద్యోగుల సం‌ఘం రిజిస్ట్రేషన్

హైదరాబాద్, ‌9 సెప్టెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ట్రేడ్ యూనియ‌న్ కాంగ్రె‌స్‌కు అనుబంధంగా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సంఘానికి రిజిస్ట్రేషన్ (నెంబ‌ర్ బి-2874) లభించింది. ఈ సందర్భంగా పార్టీ ట్రే‌డ్ యూనియ‌న్ రాష్ట్ర అధ్యక్షుడు బి.జన‌క్‌ప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య ఉద్యోగుల మొదటి సర్వసభ్య సమావేశం ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. యూనియ‌న్ నిర్మాణం, కార్యాచరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగుల వేతన సవరణ, అవు‌ట్ సోర్సింగ్ విధానం రద్దు, అర్హులైన ఉద్యోగుల‌కు పదోన్నతి తదితర అంశాలపై చర్చించారు. కార్మికుల హక్కుల కోసం యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని‌ ఈ సమావేశంలో నిర్ణయించారు.

Back to Top