పార్టీ మద్దతుదారులను బలపర్చండి: పెన్మెత్స

గంట్యాడ:

రానున్న సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మద్దతుదారులకు ఓటు వేయూలని పార్టీ విజయనగరం జిల్లా కన్వీనర్ పెన్మెత్స సాంబశివరాజు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా వసంత, చంద్రంపేట, సిరిపురం గ్రామాల్లో సహకార సంఘాల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయూ గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడారు. దివంగత మహానేత  డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు రుణ మాఫీ చేయించిన ఘనత మహానేతదేనని అన్నారు. ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. వీటన్నింటిని గుర్తించి సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులకు ఓటు వేయూలని పిలుపునిచ్చారు.
జగన్‌తోనే రైతు సంక్షేమం
నెల్లిమర్ల: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డితోనే రైతు సంక్షే మం  సాధ్యమని ఆ పార్టీ నాయకుడు డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు అన్నారు. సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత మహానేత వైయస్‌ఆర్ హయూంలో రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top