పార్టీలోకి 10 వేల మంది టిడిపి కార్యకర్తలు

బలిజిపేట (విజయనగరం జిల్లా): బలిజిపేట మండలంలోని 20 పంచాయతీల నుంచి 10 వేల మందికి పైగా టిడిపి నాయకులు, కార్యకర్తలు శనివారం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాజీ ఎంపిపి సంభాన సత్యంనాయుడు, టిడిపి మండల అధ్యక్షుడు పెనుమత్స సత్యనారాయణరాజుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు,‌ విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజ‌య్ కృష్ణ‌ రంగారావు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పాదయాత్ర ముగింపు సభ విశాఖలో జరుగుతున్న తరుణంలోనే వీరంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం.
Back to Top