పార్టీకోసం సైనికుల్లా పనిచేయాలి

హనుమంతునిపాడు:

ప్రకాశం జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన వారు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.  హనుమంతునిపాడులో మాజీ ఎంపీపీ గాయం బలరామిరెడ్డి, పల్లాల నారపరెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ సీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీల నుంచి మండలానికి చెందిన 400 మంది ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు ఎమ్మెల్యే, పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుష్ట కాంగ్రెస్ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సొసైటీ ఎన్నికల్లో తమ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన నిలిచే శ్రీ జగన్మోహన్‌ రెడ్డి కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్, టీడీపీలు మిమ్మలను ఏమీ చేయలేవని.. కష్టాల్లో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ వైఎం ప్రసాదరెడ్డి, మాజీ ఎంపీపీ గాయం ఈశ్వరమ్మ, హెచ్‌ఎంపాడు, పీసీ పల్లి, కనిగిరి, మండలాల కన్వీర్లు కమాల్, బొర్రారెడ్డి, ఖాదర్, హెచ్‌ఎంపాడు టౌన్ కన్వీనర్ బి. శ్రీనివాసులరెడ్డి, నాయకులు ఉడుముల సుబ్బారెడ్డి, యక్కంటి శ్రీనివాసులరెడ్డి, ఎస్. నారాయణ స్వామి, భవనం కృష్ణారెడ్డి, ఉసుళ్లపల్లి తిరుపతయ్య పాల్గొన్నారు.

Back to Top