అన్నా..నీవే దిక్కువిశాఖ‌: చ‌ంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో ఏ ఒక్క పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని, అతివృష్టి, అనావృష్టితో బాధ‌ప‌డుతున్నామ‌ని రైతులు వాపోయారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా బుధ‌వారం పాడి, చెర‌కు రైతులు వైయస్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. లీటరు పాలకు రూ.60 రూపాయలు ఇస్తేగాని గిట్టుబాటు కాదని, కాని డెయిరీలు రూ.28కే కొనుగోలు చేస్తున్నారన్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అలాగే చెరుకు రైతులు గిట్టుబాటు ధరలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు,మూడు ఎకరాలకు క్రాఫ్‌ హలీడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.రుణమాఫీ చేస్తానని చంద్రబాబు తప్పుడు హమీల వల్ల ప్రతిరైతు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. బ్యాంకుల వేధింపులు కూడా ఎక్కువైపోయాయన్నారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్‌..మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక స‌హ‌కార రంగంలోని డ‌యిరీల‌ను, షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల‌ను తిరిగి తెరిపిస్తామ‌ని, రైతుల‌కు తోడుగా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. .ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌కు చెర‌కు రైతులు బెల్లంను బ‌హుక‌రించి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.
Back to Top