హోదా కోసం పోరాడకపోతే భవిష్యత్తు అంధకారమే

ఏపీ అసెంబ్లీ: ఆంధ్రుల హక్కు అయిన విభజన చట్టంలోని ప్రత్యేక హోదా సాధనకు పోరాటం చేయకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. గురువారం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. గతంలో కూడా అనేక సార్లు అసెంబ్లీలో వాయిదా తీర్మానం చేశామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే ఉద్యమిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత మన ఆర్థిక పరిస్థితి ఏంటి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా అన్నది ఆలోచించాలని సూచించారు. హోదా కోసం పోరాటం చేయకపోతే మన భవిష్యత్‌ అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు చంద్రబాబు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేశారు. ఈ రోజు అదేమైనా సంజీవనా అని మాట మార్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.  ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని, అందుకే. మేం సభలో హోదాపై చర్చించాలని పట్టుపట్టినట్లు చెప్పారు. హోదా కోసం మా పోరాటం కొనసాగుతుందని కంబాల జోగులు చెప్పారు.

Back to Top