మా మొదటి ఓటు జగనన్నకేతూర్పు గోదావరి:  మేం అన్ని చూస్తున్నామని, మాకు అన్ని తెలుసు అని యువకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేక వాగ్ధానాలు చేశారని, సీఎం అయ్యాక ఏం చేశారని నిలదీశారు. డీఎస్సీ ఎప్పుడో పెట్టాల్సి ఉందన్నారు. అసలు టెట్‌ పెట్టడమే తప్పు అయితే, దాన్ని రెండు సార్లు పెట్టి, రూ.1000 తినేశారని మండిపడ్డారు. ఇప్పుడు టెట్‌కమిటీ యాక్ట్‌ పెడతామంటే..ఇన్నాళ్లు మేం టెట్‌ కోసం ఫ్రీపేయర్‌ అయింది వేస్టా అని ప్రశ్నించారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తూ, ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మిగతా నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నెలకో నోటిఫికేషన్‌ ఇస్తున్నారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టంచుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదాతోనే ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగనన్నకు మేమంతా మద్దతుగా ఉంటామని, ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, మా మొదటి ఓటు జగనన్నకే అని యువత నినదించారు.
 
Back to Top