బాబు సీఎంగా ఉండడం మన కర్మ

హైదరాబాద్ః చంద్రబాబు పథకం ప్రకారం హోదాను నీరుగారుస్తూ వస్తున్నాడని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. బాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండడం మన కర్మ అని వాపోయారు. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు విపరీతంగా వస్తాయని తెలిసి కూడా... బాబు చేతులారా హోదాను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఎన్నో పోరాటాలు చేశామని, ఇకపైనా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. హోదా వచ్చేవరకు విశ్రమించే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. దీనిలో భాగంగానే ఎల్లుండి నెల్లూరులో యువభేరి కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.

Back to Top