వైయస్‌ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే తమ లక్ష్యమని పార్టీలో చేరిన విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌సీపీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన ఓ సువర్ణయుగమని, మహానేత మరణాంతరం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పోరాటాలకు ఆకర్శితుడనై ఈ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. అందరం కలిసి పనిచేసి పలమనేరు నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ జెండాను ఎగురవేస్తామని, పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చిన ఐక్యంగా పని చేసి ఎమ్మెల్యే స్థానాన్ని వైయస్‌ జగన్‌కు కానుకగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top