ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర కార్యాలయం

కడప కార్పొరేషన్‌:వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ పదవుల్లో నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి...వైయస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పులివెందుల నియోజవర్గానికి చెందిన ఎస్‌. ఈశ్వర్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గానికి చెందిన లింగాల రాజశేఖర్‌రెడ్డిని నియమించారు. అలాగే పి. వెంకటకృష్ణారెడ్డి(కమలాపురం)ని జిల్లా జాయింట్‌ సెక్రటరీగా, ఎం. ఓబులయ్య యాదవ్‌(ప్రొద్దుటూరు)ను జిల్లా ప్ర«ధాన కార్యదర్శిగా నియమించారు. యూత్‌ వింగ్‌ ప్రధాన కార్యదర్శులుగా టి. అనిల్‌కుమార్‌(కమలాపురం), జి. బ్రహ్మంరెడ్డి(మైదుకూరు), ఎం. వెంకట నాగార్జునరెడ్డి(జమ్మలమడుగు)లను నియమించారు. జిల్లా యూత్‌ వింగ్‌ కార్యదర్శులుగా సి. రామగిరిధన్‌రెడ్డి(కమలాపురం), షేక్‌ యాసిన్‌ బాషా(కడప) ఎంపికయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన బూచుపల్లి నిరంజన్‌రెడ్డిని ఆర్‌ఎస్‌ కొండాపురం మండల అధ్యక్షుడిగా నియమించారు. అలాగే రాజంపేట నియోజకవర్గానికి చెందిన పొనతల శ్రీనివాసులును నందలూరు మండలం వైఎస్‌ఆర్‌టీయూసీ అధ్యక్షుడిగా నియమించారు. అదే మండలం వైఎస్‌ఆర్‌టీయూసీ కార్యదర్శిగా గోసు క్రిష్ణయ్య, జాయింట్‌ సెక్రటరీగా చెప్పలి హరీష్‌కుమార్, అధికార ప్రతినిధిగా బోనాసి రమేష్‌బాబు, కమిటీ సభ్యులుగా ఎన్‌. హరిబాబు, ఎం. వెంకటేశ్వర్లు, ఎన్‌. నరసింహులు ఎంపికయ్యారు.

Back to Top