హోదాపై పట్టువీడని వైయస్సార్సీపీ..పారిపోయిన ప్రభుత్వం

హైదరాబాద్ః ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మూడో రోజు ప్రత్యేకహోదా అంశంపై అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రత్యేకహోదాపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ మూడో రోజు వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభను స్తంభింపజేశారు. ఐతే, చర్చకు ముందుకు రాకుండా ప్రభుత్వం పారిపోయింది. మార్షల్స్ తో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దౌర్జన్యానికి దిగింది. అసెంబ్లీ లోపల, వెలుపల ప్రతిపక్షం గొంతునొక్కుతూ టీడీపీ నేతలు గూండాల్లా ప్రవర్తించారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు సభలో స్పీకర్ అరనిమిషం కూడా మైక్ ఇవ్వకపోవడం దుర్మార్గమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కనీసం మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనీయకుండా అధికార టీడీపీ తమ గొంతు నొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై ఎన్నో అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా...దేనిపైనా చర్చకు ముందుకు రాకుండా చంద్రబాబు మూడు రోజుల సమావేశాలను తూతూమంత్రంగా ముగించడం దారుణమని అన్నారు.

Back to Top