చంద్రబాబూ సవాల్ స్వీకరిస్తారా..!

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బహిరంగ
సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ చేయటం లో సభను తప్పు దారి పట్టించేందుకు
ప్రభుత్వం ప్రయత్నించింది. వ్యవసాయ దారులకు రుణమాఫీ చేస్తామని తామెక్కడా
చెప్పలేదని పేర్కొన్నారు. దీని మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మండి పడ్డారు.

‘‘చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు వ్యవసాయ దారులకు రుణాలన్నీ బేషరతుగా మాఫీ
చేస్తానని చెప్పినట్లు రుజువు చేస్తా. రుజువు చేయగలిగితే చంద్రబాబు తన పదవికి
రాజీనామా చేయగలరా. ఒక వేళ నేను రుజువు చేయలేకపోతే నేను ఇక్కడే రాజీనామా చేస్తారా..!’’ అని వైఎస్ జగన్ సవాల్
విసిరారు. దీనికి ప్రభుత్వ పక్షం నుంచి సమాధానం వస్తే ఒట్టు.

Back to Top