<br/>ఒంగోలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రను చూసి ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలు వైయస్ జగన్ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతను కలిసే వారిని అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.