రాజమండ్రి పుష్కర ఘాట్‌లో భక్తుడి మృతి

తూర్పు గోదావరి: మహా శివరాత్రి పర్వదినం రోజు రాజమండ్రి పుష్కర ఘాట్‌లో అపశృతి చోటు చేసుకుంది. పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానం చేస్తున్న రాంబాబు అనే భక్తుడికిS విద్యుత్‌వైర్లు తగలడంతో షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.పార్టీ నాయకులు జక్కంపుడి రాజా, కందుల దుర్గేష్, రౌతు సూర్యప్రకాశ్‌రావు, షర్మిలారెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు హైవేను దిగ్భందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వైయస్‌ఆర్‌సీపీ నేతలను అరెస్టు చేయడంతో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. అధికారుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం బలైందని, ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

Back to Top