రాజధాని ప్రాంతంలో మరో పంట ధ్వంసం

గుంటూరుః రాజధాని ప్రాంతంలో పచ్చచొక్కాల ఆగడాలు రోజురోజుకు మీతిమీరుతున్నాయి. భూములివ్వని రైతులను బెదిరింపులకు గురిచేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. తాజాగా అక్కడ మరో పంట చేను ధ్వంసమైంది. లింగాయపాలెం గ్రామంలోని సర్వే నెంబర్ 139ఏ, 139ఏ3, 140, 141లలోని గుండా రాజేశ్ అనే రైతుకు చెందిన... 7.3 ఎకరాల అరటి తోటని రాత్రికి రాత్రే సీఆర్‌డీఏ అధికారులు ట్రాక్టర్‌లతో, జేసీబీలతో దున్ని చదును చేశారు. 

ల్యాండ్ పూలింగ్‌లో తన భూమి ప్రభుత్వానికి ఇవ్వనుందునే కక్ష గట్టి రాత్రికి రాత్రే దున్నేశారని బాధిత రైతు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి సీఆర్డీఏ అధికారులను అడుగగా పొరపాటున దున్నామంటూ  బదులియ్యడం దారుణం. పంటల ధ్వంసానికి పాల్పడుతున్న ప్రభుత్వంపై రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Back to Top