ఒకడు తక్కువ కాదు ఇంకొకడు ఎక్కువ కాదు

వైసీపీ నుంచి బయటికి వచ్చేవాడు, తమతో చేరాలనుకునేవాడు తప్పకుండా జగన్ ను బూతులు తిట్టి రావల్సిందే అని టీడీపీ ముందస్తు షరతు ఒకటి పెడుతున్నదిఈమధ్య కాలంలో అలా తనను తాను దిగజార్చుకుని జగన్ ను ఏమీ అనకుండా హుందాగా టీడీపీలో చేరింది కేవలం బొబ్బిలి రాజులేఇక ప్రతివాడూ బాబు చెప్పడం, లోకేష్ స్క్రిప్టు ఇవ్వడం, మీడియా ముందు వాళ్లు వాగడంఇదే సాగుతున్నది. తాజాగా మైసూరారెడ్డి కూడా అవే రోతమాటలు, అవే సొల్లు విమర్శలు.

నిజానికి వేరేవాళ్లతో పోలిస్తే మైసూరారెడ్డికి జగన్ పట్ల అపరిమితమైన విశ్వాసం ఉండాలి(అఫ్ కోర్స్ విశ్వాసమున్నోడు రాజకీయ నాయకుడెందుకు అవుతాడు లెండి. ఎందుకంటే మైసూరారెడ్డి తనకు రాజకీయ ప్రత్యర్థే అయినా వైెఎస్ తనను నష్టపరచాలని భావించలేదు సరికదా మైసూరా కొడుకు తన దగ్గరకు వచ్చినప్పుడు వీలైనంత సాయం చేస్తానని మాట ఇచ్చాడుఅప్పట్లో తన వద్ద డబ్బు లేదంటే జగన్ స్వయంగా పూనుకుని కొంత డబ్బు అప్పు ఇప్పించి, బ్యాంకుల నుంచి ఇప్పింది ఓ సిమెంటు ఫ్యాక్టరీ నెలకొల్పే ప్రయత్నం చేశాడుజగన్ పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలకు ఓ రూపం తీసుకొచ్చింది మైసూరారెడ్డే అని తెలిసీ, తరువాత తన పార్టీలోకి తీసుకున్నదీ జగనేఓ పెద్ద మనిషిగా అక్కడ ఉండాల్సింది పోయి తనకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ఫీలై9 నెలలుగా అసలు పార్టీ కార్యకలాపాలకే దూరంగా ఉన్నాడుపోనీ, పోయేవాడు పోకుండా జగన్ పై అవే రోత ఆరోపణలు చేశాడుజగన్ ను అన్నాడని కాదు, మైసూరాలాంటోడు కూడా మాట్లాడితే ఎలా అనేది ప్రశ్న. ఇప్పుడు జగన్ కొన్ని వ్యక్తిగత కోణాల్లో ఆలోచించుకుని విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నాడువిజయసాయిరెడ్డి మైసూరాలా ఎటు లాభమొస్తే అటు పరుగులు తీసేరకం కాదుఆయన అత్యంత విధేయుడు, నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడుదీంతో మైసూరాకు కోపం వచ్చిందటవెళ్లిపోతున్నాడట.

జగన్ ఎవరి మాటా వినడని ఒక ఆరోపణ చేశాడుతను ఎవరి మాటా వినడు కాబట్టే ఈమాత్రమైనా పార్టీని కాపాడుకోగలిగాడు, మీలాంటోళ్ల మాట వింటే ఏనాడో పార్టీ పుట్టి మునిగేదేమోఅంతెందుకు ఈయన చేరుతున్న చంద్రబాబు శిబిరం పరిస్థితేమిటో తెలుసా? డిప్యూటీ సీఎం కూడా తను చెబితే అటెండర్ కూడా నా మాట వినడం లేదని ఆరోపిస్తున్నాడుఅదీ స్థితిఅంతా లోకేష్ చెప్పినట్టే సాగుతున్నదిఏ మంత్రీ ఏ నిర్ణయమూ తీసుకోవటానిక ివీల్లేదుఅసలు మంత్రుల వెంట ఉండే పీఏలు, పీఆర్వోలు లోకేష్ కు రెగ్యులర్ గా రిపోర్టులు పంపిస్తారు. అధికారపీఠం కోసమే జగన్ తాపత్రయమని మరో విమర్శ చేశాడుదేశంలో అధికారం కోసం గాకుండా వేరే ప్రయోజనం కోసం రాజకీయం చేసేవాడిని ఒక్కడిని చూపించు మైసూరాప్రజాసమస్యలపై పోరాడలేడని జగన్ పై మరో విమర్శ చేశాడుఇంత సుదీర్ఘ అనుభవమున్న మైసూరా మనకు తెలిసి ఒక్కటంటే ఒక్క చిన్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నది లేదు.

నువ్వు టీడీపీ పంచన చేరటానికి కారణం చంద్రబాబు నీ సిమెంటు ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని అనుమతులనూ క్లియర్ చేస్తానూ అన్నందుకే కదాఅది అందరికీ తెలిసిందే కదా. వాస్తవానికి టీడీపీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్న తీరుకన్నాఅభివృద్ధి కోసమని ఒకడు, కార్యకర్తలు కోరారని మరొకడు, ఇంకేదో చెబుతూ ఇంకొకడు మాట్లాడుతున్న తీరే అసహ్యంగా ఉందినైతిక విలువలు, సిద్ధాంతాలు వంటివి వీళ్ల డిక్షనరీల్లోనే ఉండవు కదా.

ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం. గతంలో మిమ్మల్ని ఛీ కొట్టి చీదరించుకొన్న పార్టీ చెంతకే తమరి ప్రయాణం అన్న సంగతి అందరికీ తెలిసినదే. అందుకే కొన్ని రోజులు ఆగుతున్న సంగతి అర్థం అవుతోంది. 

Back to Top