హైదరాబాద్: వైయస్సార్సీపీ తరపున మొట్టమొదటి రాజ్యసభ సభ్యునిగా విజయసాయిరెడ్డి ఎన్నిక లాంఛనంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన సునందారెడ్డి తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకుంటున్నట్లు సునందారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణకు లేఖ అందజేశారు. దీంతో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన వి. విజయసాయిరెడ్డి (వైఎస్సార్‌సీపీ), మరో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఈ ఎన్నికను శుక్రవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉన్నది. ఈ గడువు ముగిసిన అనంతరం రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించి ధ్రువ పత్రాలను అందజేస్తారు. దీంతో విజయసాయిరెడ్డి అధికారికంగా ఎన్నికయినట్లు అవుతుంది. <br/>