నేనున్నాననే భరోసాయే..ఓదార్పుయాత్ర

()చెప్పిన మాట కోసం మొదలైందే ఓదార్పు యాత్ర
()కష్టాలు ఎదురైనా.. ఆరోగ్యం సహకరించకున్నా ఆగని యాత్ర
()227 రోజుల్లో 518 కుటుంబాలను ఓదార్చిన వైయస్ జగన్‌
()సమకాలీన రాజకీయ చరిత్రలో సంచలనాత్మక రికార్డు
()మాట నిలబెట్టుకుని జననేతగా నిలిచిన వైయస్‌ జగన్‌

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి మాట తప్పడం.. మడమ తిప్పడం తెలియదు. ఒకసారి మాట ఇస్తే అది ఎంత కష్టమైనా పూర్తి చేసే వరకు ఆయన నిద్రపోరు. అదే ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ కూడా వంట పట్టించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన ఒకే ఒక్క మాట కోసం  వేల కిలోమీటర్లు యాత్ర చేశారు. మహానేత హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని.. మీకు నేనున్నానంటూ వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు. మహానేత వైయస్‌ ఏరోజు అయితే తన పాదయాత్రను ప్రారంభించారో అదే తేదీన వైయస్‌ జగన్‌ కూడా ఓదార్పు యాత్రను ప్రారంభించి చరిత్ర సృష్టించారు. 17వేలకు పైగా కిలోమీటర్లు తిరిగి అన్ని కుటుంబాలను ఓదార్చిన నేత ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జగనే అని ముక్తకంఠంతో చెప్పవచ్చు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి  మరణించిన 22వ రోజున వైయస్‌ జగన్‌ నల్లకాలువ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘నాన్న మరణాన్ని తట్టుకోలేక మరణించిన ప్రతి కుటుంబాన్ని రానున్న రోజుల్లో నేను వచ్చి కలుస్తాను’’ అని . ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబాన్ని కలిశారు వైయస్‌ జగన్‌. 

మహానేత అడుగు జాడల్లోనే...
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ తన పాదయాత్రను ప్రారంభించిన ఏప్రిల్‌ 9వ తేదీ రోజునే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. 2010, ఏప్రిల్‌ 9వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో మధ్యాహ్నం 3:30 గంటలకు యాత్ర మొదలైతే అది పూర్తి అయ్యే సరికి మరుసటి రోజు ఉదయం 7:30 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది.  అలా ఒక్కడితో మొదలైన ఓదార్పు యాత్ర తర్వాత రోజుల్లో అశేష జనాధరణతో ఓ ప్రభంజనంలా మారింది.  ప్రజాప్రస్థానం వైయస్‌ను చరిత్రలోనే అరుదైన జనహృదయ నేతగా మారిస్తే, ఓదార్పు యాత్ర వైయస్ జగన్‌ను ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అద్దంగా నిలిపింది. అంతేకాదు జగన్‌ను ఒకమహా శక్తిగా నిలిపింది. 

ముందుకు సాగుతూనే...
వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్రలో భాగంగా మార్గమధ్యంలో మహానేత అభిమానులు ఏర్పాటు చేసుకున్న  వేల  వైయస్‌ విగ్రహాలను  ఆవిష్కరించారు. అంతేకాదు మండే ఎండలోనూ,  హోరున కురుస్తున్న వర్షంలోనూ కట్టుకదలకుండా ప్రజలు వైయస్ జగన్‌ కోసం వేచి చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  అయితే ఓదార్పు యాత్రలో జననేత నాలుగైదు సార్లు అనారోగ్యానికి గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో అభిమానుల కరచాలనాలతో గోళ్లు గీరుకుని.. చేతికి గాయాలై రక్తాలు కారినా, చేతికి కట్టుతో ముందుకు సాగారు. ఈ ఇన్ఫెక్షన్‌కుతోడు వర్షంలో తడవడంతో తీవ్ర జ్వరం వచ్చినా.. ఆయన యాత్ర ఆపలేదు. గాయాలవుతున్నా.. ప్రజాభిమానాన్ని కాదనలేక వారికి చేయి అందిస్తూనే ఉన్నారు. ప్రకాశం జిల్లా యాత్రలో పూల జల్లులు కురిపించడంతో పూల రేకులు కళ్లలోపడి ఇన్ఫెక్షన్‌ మరీ తీవ్రమవడంతో... నేతలు, వైద్యుల బలవంతం మేరకు నాలుగు రోజులు విరామం తీసుకున్నారు. అది చాలదని, ఇంకొన్ని రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు వారించినా వినలేదు. ఎదురుచూస్తున్న అభిమానులను నిరాశపరచడం తనకు ఇష్టం లేక యాత్రలో ముందుకు సాగారు. 

ఆ ఆలోచనల నుంచి పుట్టినవే పార్టీ పథకాలు
మహానేత మరణాన్ని తట్టుకోలేక అస్తమించిన వారి కుటుంబాలను కలిసి ఓదార్చాలని వైయస్‌ జగన్‌ మొదలు పెట్టిన ఓదార్పు యాత్ర ... పేదోడి బతుకులు ఆయన కళ్లకు కట్టింది. ప్రజా సంక్షేమం కోసం నాయకుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియజేసింది. వారి కష్టాలను ఎలా తీర్చాలా అని ఆలోచింపజేసింది. ఆ ఆలోచనల నుంచి పుట్టిన పథకాలనే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ  ప్లీనరీ సమావేశంలో వైయస్‌జగన్‌ ప్రకటించారు. ‘‘కేజీ నుంచి పీజీ వరకూ పేద విద్యార్థులందరికీ ఉచిత విద్య, అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లికి బ్యాంకు ద్వారా నెల నెలా డబ్బు చెల్లింపు. అంగన్‌వాడీ నుంచి పది వరకు రూ.500. ఇంటర్‌కు రూ.700, డిగ్రీ పీజీలకు రూ.1000లు. వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పింఛన్‌ రూ.200 నుంచి రూ.700కు పెంపు. వికలాంగుల పింఛన్‌ రూ.1000కి పెంపు. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణం తదితర పథకాలను వైయస్ జగన్‌ తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 

–––––––––––––––––––––––––––––

227 రోజులు.. 518 కుటుంబాలు.. 17వేల  కిలోమీటర్లకు పైగా...

జిల్లారోజులుకుటుంబాలు
పశ్చిమ గోదావరి442
ఖమ్మం554
శ్రీకాకుళం415
తూర్పుగోదావరి1878
ప్రకాశం3736
నెల్లూరు2336
విశాఖ1018
విజయనగరం1017
అనంతపురం1125
వైయస్‌ఆర్‌ జిల్లా527
కర్నూలు1637
కృష్ణ3962
గుంటూరు1947
చిత్తూరు2624
మొత్తం227518


–––––––––––––––––––––––
వేల కిలోమీటర్ల ఓదార్పుయాత్రలో కోట్లమంది గుండె తలుపులు తట్టాక, ఓదార్పు యాత్ర  ఇక వైయస్ జగన్‌ది కాకుండా పోయింది. అది ప్రజల ఓదార్పు యాత్రగా మారిపోయింది. ఆ క్రమంలోనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టింది. ఓదార్పు పాఠాలే జెండా అయ్యాయి, అజెండాగా మారాయి.
–––––––––––––––––––––––––

అన్నకు అండగా చెల్లి
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించిన నేపథ్యంలో ఇక ఓదార్పు యాత్ర ఆగిపోతుందేమోననుకున్నారు అంతా. అయితే వైయస్‌ జగన్‌కు తన చెల్లి వైయస్‌ షర్మిల అండగా నిలిచారు. తాను జగనన్న వదిలా బాణాన్ని అంటూ ఆమె ఓదార్పు యాత్రను పునఃప్రారంభించారు.  వైయస్‌ జగన్‌ ఓదార్చగా మిగిలిన కుటుంబాలను తాను ఓదార్చుతానని యాత్ర మొదలు పెట్టి  310 కుటుంబాలను ఓదార్చారు. తెలంగాణలోని 9 జిల్లాల్లో  8518 కిలోమీటర్లు ప్రయాణించిన వైయస్‌ షర్మిల 55 రోజుల్లో 310 కుటుంబాలను ఓదార్చారు. అన్నకు తగ్గ చెల్లెలు అనిపించుకున్నారు. 

Back to Top