టీడీపీ నేతల యత్నాలకు చుక్కెదురు

శ్రీకాకుళం
  : శ్రీకాకుళం
జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రానికి ప్రజల నుంచి తీవ్ర
నిరసన వ్యక్తమవుతోంది. రణస్థలి దగ్గర విద్యుత్ కేంద్రం
ఏర్పాటుకి టీడీపీ నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా   కోటపాలెం, అల్లివలస ప్రాంతాల్లో భూముల సర్వే కోసం స్పెషల్ డిప్యూటీ
కలెక్టర్ సీతారామారావు, తహసీల్దార్
ఎం. సురేష్ వచ్చారు. దాంతో అక్కడి ప్రజలు వారిద్దరినీ అడ్డుకున్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అణువిద్యుత్తు కేంద్రంతో ఈ ప్రాంతం
నాశనమైపోతుందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు
అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులకు ఎలా పూనుకుంటున్నారంటూ గ్రామస్థులు అధికారులను
నిలదీశారు. కలెక్టర్ ప్రజలకు ప్యాకేజీలు ఇస్తామని, పునరావసం కల్పిస్తామని ఆయన చెప్పిన గ్రామస్థులు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, రెండు వర్గాలకు నచ్చ చెప్పారు. దీంతో
తాత్కాలికంగా సర్వే పనులు నిలిపివేసి అధికారులు వెళ్లిపోయారు. 

Back to Top