వైయ‌స్ఆర్‌సీపీలోకి నైనారు కుటుంబం


తిరుపతి : తిరుపతిలో ఎన్టీఆర్‌ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉన్న నైనారు కుటుంబానికి చెందిన నైనారు మధుబాల బంధుమిత్రులు, అనుచరులతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమన కరుణాకరరెడ్డి నివాసంలో జరి గిన ఈ కార్యక్రమంలో నైనారు మధుబాలకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కరుణాకరరెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాపులు సీఎం చంద్రబాబునాయుడి మోసాలను గుర్తించారని, అందుకే వారంతా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని  పేర్కొన్నారు. నైనారు కుటుంబంతో తనకు చిన్ననాటి నుంచి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఆ కుటుంబం పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటు బ్యాంకు కోసం గత ఎన్నికల్లో కాపులను వాడుకున్న సీఎం చంద్రబాబు వారిని దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. కుల రాజకీయాలతో చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెతను నిజం చేస్తూ కుల రాజకీయాలే ఆయన్ను ముంచనున్నాయని జోస్యం చెప్పారు. కాపులకు వైయ‌స్ఆర్‌ సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. నైనారు మధుబాల మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.  కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమకుమారి, బొమ్మగుంట రవి, బండ్ల లక్ష్మీపతి పాడి శివప్రసాద్‌ యాదవ్, పుల్లయ్య, రాధామాధవి, శైలజ, లక్ష్మీరెడ్డి, వాసుయాదవ్, కేతం జయచంద్రారెడ్డి, గీతా యాదవ్, సాయికుమారి తదితరులు పాల్గొన్నారు.


Back to Top