కోతల బడ్జెట్

హైదరాబాద్) 2016..17 ఆర్థిక
సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్  కోతల
మార్గంలో ప్రయాణించింది. ముఖ్యంగా హామీలు, పద గుంభనలు అధికంగా కనిపించాయి. కానీ
వాస్తవంగా ముఖ్యమైన శాఖల్లో కోత పెట్టడం గమనించ దగిన విషయం. రైతు రుణ మాఫీ కి ఈ
ఏడాది మరో రూ. 3,500 కోట్లు విదిల్చారు. వాస్తవానికి రైతుల అప్పులు రూ. 84 వేల
కోట్ల పై చిలుకు ఉంటే వాటికి అయిన వడ్డీ దాదాపు రూ. 24 వేల కోట్ల దాకా ఉందని
లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికి సుమారు రూ. 7వేల కోట్ల దాకా రెండు విడతల్లో
రుణమాఫీకి నిదులు ఇచ్చారు. వాటిని తీసేస్తే రూ. 17 వేల కోట్లు ఉంటాయి. అంటే అసల
మాట దేవుడెరుగు వడ్డీలో అయిదో వంతు కూడా ఇవ్వలేదన్న మాట.

ఇక, సాగునీటి రంగానికి
కేటాయించిన నిధుల్లో రూ. వెయ్యి కోట్లు, విద్యుత్ రంగ కేటాయింపుల్లో రూ. 3 వేల
కోట్ల మేర కోత పడినట్ల తెలుస్తోంది. మొత్తం మీద కీలకమైన శాఖలకు కేటాయింపుల్లోనే
కోతలు పడితే ఆ మేరకు భారం ప్రజల మీద పడుతుందన్న వాదన వినిపిస్తోంది. 

Back to Top