లండన్ లో తెలుగువారితో ఆత్మీయ సమావేశం

 లండన్‌లో తెలుగువారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వ్యక్తిగత కారణాలతో లండన్‌ వెళ్లిన వైయస్‌ జగన్‌ అక్కడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు, అభిమానులతో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి వైయస్‌ జగన్‌ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వ్యక్తిగత కారణాలతో లండన్‌ వచ్చిన తనకు తెలుగు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలకడం పట్ల వైయస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు . పనులు విడిచిపెట్టి మరీ తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ముచ్చటించారు. 

తాజా ఫోటోలు

Back to Top