సెవ్ డెమొక్రసీకి ఎన్ఆర్ఐల మద్దతు

వర్జీనియా: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ చేస్తున్న పోరాటానికి అమెరికాలోని ఎన్ఆర్ఐలు మద్దతు పలికారు. వర్జీనియాలో ఆదివారం 'సేవ్ డెమోక్రసీ' సంఘీభావ సభ నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్, రీజినల్ ఇన్ ఛార్జ్  వల్లూరు రమేష్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వాషింగ్టన్ డి సి మెట్రో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సంఘీభావ సభకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.  

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాసటగా తెలుగువాళ్లు, వైఎస్‌ఆర్ అభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేయాలని రమేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. వర్జీనియాలోని బంజార ఇండియన్ కుసిన్ ఆడిటోరియంలో రేపు సాయంత్రం 7:00 గంటలకు సభ జరుగుతుంది.
Back to Top