వైయస్‌ జగన్‌ను కలిసిన ఎన్‌ఆర్‌ఐ దంపతులు

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు దేశ విదేశాల నుంచి మద్దతు లభిస్తోంది. గతేడాది నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం అమెరికాలో స్థిరపడ్డ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం నియోజకవర్గానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ దంపతులు హరిప్రసాద్, సరితలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఏ రాజకీయ నాయకుడికి, సినిమా నాయకుడికి లేని ప్రజాధరణ వైయస్‌ జగన్‌కు ఉందన్నారు. ఆయన పాదయాత్ర ద్వారా రెండు కోట్ల మందిని కలవడం సంతోషకరమన్నారు. ప్రజలు ఆయన్ను దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని భావిస్తున్నారన్నారు.  యూఎస్‌లో కూడా చాలా మంది వచ్చి మమ్మల్ని కలుస్తుంటారని, వైయస్‌ఆర్‌సీపీకి ఉన్న పట్టు మరే పార్టీకి లేదన్నారు. ఏపీలో ఎటు చూసినా అవినీతే కనిపిస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ వల్ల అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నామని చెప్పారు.  వైయస్‌ జగన్‌ మమ్మల్ని ఆప్యాయంగా పలకరించారని సంతోషం వ్యక్తం చేశారు. 
 
Back to Top