దురుద్దేశంతోనే నోటీసులు

గుంటూరు: తుని ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. సీఐడీ విచారణ నిమిత్తం ఇవాళ గుంటూరు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ....తుని ఘటనతో ఏం సంబంధం లేకపోయినా,  చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చినట్లు భూమన తెలిపారు. కాపులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. కాపుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. Back to Top