కోర్టు ధిక్కరణలోనూ హై డ్రామా

హైద‌రాబాద్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని తుంగ‌లోకి తొక్కిన హైడ్రామా అలాగే కొన‌సాగుతోంది. ఎమ్మెల్యే రోజా ను శాస‌న‌స‌భ లోకి అనుమ‌తించాలంటూ ఇచ్చిన హైకోర్టు సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను అసెంబ్లీ వ‌ర్గాలు అంగీక‌రించ‌లేదు. ఆమెను అడ్డుకోవ‌టం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్ప‌డ్డారు. క‌నీసం ఈ అంశంలో కోర్టు ధిక్కరణ నోటీసులు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి స్టాండింగ్ కౌన్సిల్ నిరాకరించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రోజా తరఫు న్యాయవాది తెలిపారు. అయితే నోటీసులు స్వీకరించవద్దంటూ తమకు ఆదేశాలు ఉన్నాయని పాత పాటే వినిపించారు. 
Back to Top