ప్రజలను అడ్డుకోవడం టీడీపీ నేతల అబ్బతరం కూడా కాదు

నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ నంద్యాల చరిత్రకు సాక్షంగా నిలవబోతుందని వైయస్‌ఆర్‌ సీపీ గుంటూరు జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి నంద్యాల ఉప ఎన్నికలు పునాధి కానున్నాయన్నారు. బహిరంగ సభ ప్రాంగణం వద్ద లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను టీడీపీ నాయకులు అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ సమావేశానికి ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడం తెలుగుదేశం పార్టీ నాయకుల అబ్బతరం కూడా కాదన్నారు. 

Back to Top