సంతాప సభలో పాల్గొనడం లేదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్ పిన్నెళ్లి, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా

అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై మంగళవారం అసెంబ్లీలో నిర్వహించిన సంతాప సభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాల్గొనడం లేదని పార్టీ చీప్‌ విఫ్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, దాడిశెట్టి రాజా తెలిపారు. చంద్రబాబు మంత్రి పదవి ఆశ చూపి ఇవ్వకపోవడం వల్లే భూమా నాగిరెడ్డి మానసిక క్షోభకు గురై మృతి చెందారని వారు ఆరోపించారు. వైయస్‌ఆర్‌సీపీ భూమాకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చి ఎంతో గౌరవించిందని చెప్పారు. 

Back to Top