ఏపీకి మేలు చేసే ధ్యాసే లేదు

 • బడ్జెట్‌లో ఏపీ హక్కులపై ప్రస్తావన రాకపోవడం దురదృష్టకరం
 • అమరావతికి శంకుస్థాపనకు తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు ఇచ్చినట్లుగా కేంద్ర బడ్జెట్‌
 • 60 రోజుల గడువు ఇస్తే ప్రధాని ఏం మేలు చేశారు
 • వ్యవసాయరంగాన్ని నట్టేట ముంచి కేంద్ర బడ్జెట్‌ 
 • బీజేపీ ఇస్తామన్నా చంద్రబాబే హోదా వద్దంటున్నారా?
 • టీడీపీ నేతలు బడ్జెట్‌ బ్రహ్మాండం అనడం సిగ్గుచేలు
 • వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి

 • హైదరాబాద్‌: అమరావతి శంకుస్థాపనకు వచ్చి ప్రధాని మోడీ తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఉందని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. అన్యాయంగా విభజించిబడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మేలు చేయాలనే ధ్యాసే లేకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత నాకు 60 రోజులు గడువు ఇవ్వండి ఎంతో మేలు జరుగుతుందని అని ప్రధాన మంత్రి ఆశ కల్పించి పేద, మధ్య తరగతి ప్రజానికాన్ని నట్టేట ముంచారని విమర్శించారు. కేంద్రం బడ్జెట్‌పై హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా  పేద వారికి ఈ బడ్జెట్‌లో మేలు జరుగుతుందని ఎదరుచూస్తూ ఎడారిలో ఒయాసిస్‌లా అయిపోయిందని ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. ఆర్థికమంత్రి స్పీచ్‌లో వ్యవసాయరంగ ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రసంగించారు కానీ ఏ విధంగా రెట్టింపు చేస్తారనే క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఎంఎస్‌బీ ప్రైజ్‌ పెరిగితే కానీ రైతు ఆదాయం పెరగదని, ఇన్‌పుట్‌ సబ్సీడీలతో రైతుల ఆదాయం పెంచవచ్చునని తెలియదా అని ప్రశ్నించారు. ఏమీ చేయకుండా ఆదాయం పెంచుతామంటే చెవిలో పువ్వుపెట్టినట్లేనని దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత సంవత్సరానికి కేవలం 3 శాతం మాత్రమే ఎంఎస్‌బీ ప్రైస్‌ పెరుగుతందన్నారు. ఈ ధోరణిలో ఎలా వ్యవసాయ ఆదాయాన్ని అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. 
  రూ. 9 లక్షల కోట్లు ఏమయ్యాయి
  గత బడ్జెట్‌లో రైతాంగానికి కేటాయించిన రూ. 9 లక్షల కోట్లు ఎంత వరకు ఖర్చు చేశారో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టత ఇవ్వాలని పార్థసారధి డిమాండ్‌ చేశారు. ఆయనకు అనువుగా ఉన్న చోట్లే రైతాంగాన్ని ఖర్చు చేసి మెప్పుపొందారని, కానీ ఏపీ రైతాంగంపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. గత సంవత్సరం కంటే కేవలం పది శాతం మాత్రమే అగ్రికల్చర్‌ టార్గెట్‌ పెంచారని చెప్పారు. రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిలా పావలా వడ్డీలు కూడా ఇస్తామని చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతులకు పూర్తిగా నిరాశ కల్గించేలా ఉందన్నారు. నష్టపోయిన రైతులకు చేయూతనివ్వాలనే ఆలోచన లేని ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిందన్నారు. వ్యక్తిగత స్వార్థాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకున్న సీఎం ఆవాస్‌ యోజనా, నరేగా నిధులు మాత్రం భారీగా పెంచారన్నారు. పీఎం ఆవాస్‌ యోజనకు రూ. 17 వేల నుంచి 23 వేలకి, నరేగా రూ. 38,500 నుంచి 48 వేల కోట్లు పెంచారన్నారు. ఇది ప్రధానంగా ఉపాధి హామీ పథకం అయినా ఏపీలో మాత్రం కొంత మంది స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. 
  ఏపీ ప్రజల ఆశలపై నీళ్లుజల్లారు
  5 కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజానికం ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా,  విశాఖ రైల్వేజోన్‌లపై కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావనే రాలేదని పార్థసారధి మండిపడ్డారు. జార్ఖండ్, గుజరాత్‌ రాష్ట్రాలకు మాత్రం రెండు ఎయిమ్స్‌ ఆసుపత్రులు నిర్మాణం చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. నష్టపోయిన ఏపీపై కనీసం ప్రస్తావన రాకపోవడం దౌర్భాగ్యమన్నారు. క్యాపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌ గతేడాది కంటే తక్కువే కేటాయించారని చెప్పారు. గత సంవత్సరం 2015–16లో రూ. 1,15,322 కోట్లు కేటాయిస్తే 2016–17 బడ్జెట్‌లో రూ. 1,09,131 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కేంద్రం చెప్పే గణాంకాలు ఎంతవరకు కరెక్ట్, ఎన్ని అమలు అవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రైల్వేకి కూడా గతంకంటే రూ. 6 వేలు మాత్రమే పెంచారని చెప్పారు. రూ. 1.25 లక్షలు గతంలో ఉంటే ప్రస్తుతం రూ. 1.31 లక్షలు పెంచారని చెప్పారు. రాబోయే రోజుల్లో గతంలో జులైలో రైల్వే చార్జీలు పెంచినట్లే ఈఏడు కూడా పెంచి ప్రజలకు భారం మోపుతారనే అనుమానం కలుగుతుందన్నారు.
  కేంద్ర జీడీపీపై ఆర్‌బీఐ అనుమానం 
  కేంద్ర ప్రభుత్వం చెప్పిన 7.1 జీడీపీ శాతానికి భాగస్వామ్య సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమని పార్థసారధి అన్నారు. ఇండెక్స్‌ ఆఫ్‌ఇండస్ట్రీయల్‌ ప్రొడక్షన్‌ చూస్తే మే 2014 ప్రధాని నరేంద్రమోడీ వచ్చే సరికి 183.5 ఐఐపి ఉందన్నారు. కానీ ప్రస్తుతం నవంబర్‌ 2016కి చూస్తే 181.2కి పడిపోయిందన్నారు. గ్రాఫ్‌ ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ 2015–16లో 35.41 లక్షల కోట్లు ఉంటే, 2016–17కి 35.35 లక్షలకు పడిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీడీపీ ఎలా పెరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.  ఆర్థికమంత్రి 17 శాతం పెరిగిందని చెప్పుకుంటున్న రెవెన్యూ  ప్రభుత్వ చర్య వల్ల పెరిగిందని ఎవరూ భావించడం లేదన్నారు. పెట్రోలియం ప్రొడక్స్‌ ధరలు తగ్గిపోవడంతో వచ్చిందన్నారు.  108 డాలర్లు  ఉన్న పెట్రోల్‌ బ్యారెల్‌ రేట్‌  28, తరువాత 51 డాలర్లకు తగ్గడంతో ప్రభుత్వానికి 17 శాతం రెవన్యూపెరిగిందని గ్రహించాలన్నారు. పెరిగిన రెవెన్యూతో పేద, మధ్యతరగతి ప్రజానికానికి ఎలాంటి అభివృద్ధి చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
  ఏపీ హక్కుల కోసం వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం
  పార్లమెంట్‌లో కేంద్రం ప్రత్యేక హోదాపై ప్రస్తావించకపోవడానికి టీడీపీయే కారణంగా అనిపిస్తోందని పార్థసారధి అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా టీడీపీ అడ్డుపడుతుందని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన హక్కులపై టీడీపీ మాట్లాడకుండా బడ్జెట్‌ బ్రహ్మండంగా ఉందని పొగుడడం సిగ్గుచేటన్నారు. బడ్జెట్‌ మూలంగా రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్‌ను సమర్థిస్తారా.. లేక రాష్ట్రానికి ఏమీ జరగలేదని మీ నిరసనను  తెలియజేస్తారా చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.  పార్లమెంట్‌ సమావేశాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు విభజన హక్కుల కోసం పోరాటం చేస్తారని చెప్పారు. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్ర హక్కులను పట్టించుకోవాలని సూచించారు.
Back to Top